మనం అండ్రాయిడ్ ఫోన్ కొన్నప్పుడు కొన్ని పనులు మాత్రమే చేయగలం, కొన్ని పనులు మనం చెయ్యలేకుండా పరిమితి విధించబడి ఉంటుంది. సెక్యూరిటి కారణాల వల్ల మనకు ఫోన్ లో రూట్ పర్మిషన్ ఇవ్వబడదు. మనం ఫోన్ లో పూర్తిగా కస్టమైజ్ చేసుకునే విధంగా రూట్ సూపర్ యూసర్ పర్మిషన్ పొందటం కోసం రూటింగ్ చేయవలసి ఉంటుంది.

Android Phone Rooting in telugu

ఫోన్ రూటింగ్ చెయ్యడం వలన ఉపయోగాలు:

1. ఫోన్ లో డిఫాల్ట్ గా ఇవ్వబడిన అప్ప్స్ ను ఆన్ ఇన్స్టాల్ చెయ్యవచ్చు.
2. కొత్త ఫాంట్స్ ను ఇన్స్టాల్ చెయ్యవచ్చు.
3. సిపియు ఓవర్ క్లాక్ అండర్ క్లాక్ చెయ్యవచ్చు.
4. బ్యాటరీ లైఫ్ ఆప్టిమేజ్ చెయ్యవచ్చు.
5. ఫుల్ బ్యాక్ అప్ తీస్కోవచ్చు.
6. కస్టమ్ రోమ్ లను ఇన్ స్టాల్ చేస్కోవడం ద్వారా కొత్త ఆండ్రోయిడ్ వర్షన్ కి అప్డేట్ కావచ్చు.

ఫోన్ రూట్ చెయ్యడం వల్ల కలిగే నష్టాలు:

1. వారంటీ పోతుంది.
2. అఫిసియల్ అప్ డేట్స్ పొందలేము.
3. రూట్ యూసర్ పర్మిషన్ వల్ల మన ఫోన్ లోకి వైరస్, రాన్సంవేర్ వస్తే ఆ పర్మిషన్ తీస్కునే ఫోన్ ని కంట్రోల్ లోకి తీస్కునే అవకాశం ఉంది.

రూటింగ్ ఎలా చెయ్యాలి:

ఆండ్రోయిడ్ ఫోన్లను రూటింగ్ చెయ్యడం కోసం kingroot, kingoroot, oneclickroot లాంటి అప్ప్లికేసన్ లు అందుబాటులో ఉన్నాయి. మన ఫోన్ కంపెనీ ని బట్టి ఒకో కంపెనీ ఫోన్ లకు ఒక్కో అప్ప్లికేసన్ తో రూట్ చేస్కోవచ్చు.

రూటింగ్ చేస్కోవడం అనేది కొంత సేపట్లో అయిపోయినా అది అంతా సులువు కాదు, ఫోన్ లో OEM ఆన్ లాక్ చేయబడి ఉంటుంది, అది తీసిన తర్వాత మాత్రమే మనం ఫోన్ ను రూట్ చేయగలం. ఫోన్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే రూటింగ్ జోలికి వెళ్ళడం మంచిది, అవగాహన ఉన్న వాళ్ళు తిరిగి స్టాక్ రోమ్ ని ఫ్లాష్ చేయడము ద్వారా వారంటీ పొందవచ్చు. అవగాహన లేని వాళ్ళు రూటింగ్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.