లోపాల కారణంగా రిటర్న్ చేయబడి తిరిగి రేపేరు చేసి అమ్మే వస్తువులను రిఫర్బిషిడ్ (Refurbished) వస్తువులు అంటారు. అలాంటి పునరుద్దరించబడిన (Refurbished) వస్తువులను అమ్మడానికి Flipkart కొత్తగా 2gud.com అనే కొత్త వెబ్సైట్ ని ప్రారంబించింది. కొత్తగా కొన్న వస్తువులను లోపాలతో రిటర్న్ చేయగా వచ్చిన వస్తువులనే కాకుండా ఎక్స్ఛేంజి ద్వారా వచ్చిన వస్తువులను కూడా ఏమన్నా లోపాలు ఉంటే రేపేరు చేసి ఈ పోర్టల్ లో అమ్ముతారు.

Refurbished వస్తువులు అంటే ఏమిటి

కొత్తగా కొన్నపుడు రిటర్న్ చేయబడిన వస్తువులను Unboxed అని, చాలా తక్కువ వాడిన వస్తువులను Like New, కొద్దిగా వాడిన వస్తువులను Superb, వస్తువు మీద ఉన్న స్క్రాచెస్ ని బట్టి Very Good, Good అనే Categories గా విభజించి వస్తువులను ఈ పోర్టల్ ద్వారా అమ్మడం జరుగుతుంది. Refurbished వస్తువుల గురించి ఈ క్రింది వీడియోలో చూడొచ్చు.



2gud.com వెబ్సైట్ కేవలం మొబైల్ బ్రౌసర్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ప్రస్తుతానికి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచీలు, పవర్ బ్యాంక్ వంటి వస్తువులను అమ్మడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకొన్ని వస్తువులను తెచ్చే అవకాశం ఉంది.

Refurbished వస్తువులు ఎలా కోనాలి:

2గుడ్.కామ్ లో ఫ్లిప్కార్ట్ అక్కౌంట్ ద్వారా లాగిన్ అయి కొనొచ్చు. మీరు కొనబోయే వస్తువు కొత్త వస్తువు ధర మరియు refubished ధర పోల్చుకుని మీరు డిస్కౌంట్ ఎక్కువ లభిస్తుంది అనిపిస్తే refubished వస్తువులు కొనొచ్చు. అతి తక్కువ మొత్తం లో డిస్కౌంట్ లభిస్తుంది అనుకుంటే కొత్తది కొనడం మంచిది.

Refubished వస్తువుల్లో మీకు పాత మోడల్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ లబిస్తుంది. కొత్త మోడల్స్ లో డిస్కౌంట్ తక్కువ ఇస్తాడు. మీకు పాత మోడల్ వస్తువు అయినా పర్వాలేదు అనుకుంటే అవి మీకు తక్కువ ధరకే లభిస్తాయి.

Refurbished వస్తువులు కొనడానికి అనేక వెబ్సైట్లు ఉన్నప్పటికి 2గుడ్.కామ్ ఉత్తమమైన వెబ్సైట్.